ఢిల్లీలో కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కుపట్టం కట్టండి : పీసీసీ అధికార ప్రతినిధి బండి సుధాకర్ గౌడ్

ఢిల్లీలో కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కుపట్టం కట్టండి : పీసీసీ అధికార ప్రతినిధి బండి సుధాకర్ గౌడ్

న్యూఢిల్లీ, వెలుగు: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఓట్లు అడిగే నైతిక హక్కు బీజేపీకి లేదని పీసీసీ అధికార ప్రతినిధి బండి సుధాకర్ గౌడ్ అన్నారు. సోమవారం ఢిల్లీ నాంగ్లోయి నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి రోహిత్ చౌదరి తరఫున సుధాకర్ ఇంటింటి ప్రచారం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాజకీయ విబేధాలతో కేంద్రంలోని బీజేపీ, ఢిల్లీని పాలించిన ఆప్ హస్తిన అభివృద్ధిని మరిచాయన్నారు.

 ఈ రెండు పార్టీలు ఢిల్లీ డెవలప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు నిరోధకులుగా మారాయని విమర్శించారు. ఎల్జీని అడ్డుపెట్టుకొని బీజేపీ చేస్తున్న రాజకీయ కక్ష సాధింపు చర్యలతో ఔటర్ ఢిల్లీ ప్రాంతమంతా మురికికూపంగా మారిందని మండిపడ్డారు. ఆనాడు కాంగ్రెస్ చేసిన అభివృద్ధి తప్ప.. ఈ పదేండ్లలో ఎలాంటి డెవలప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు దేశ రాజధాని నోచుకోలేదన్నారు.