కుల గణన చేసి బీసీలకు పెద్దన్నగా నిలిచిన సీఎం రేవంత్ :  చనగాని దయాకర్

కుల గణన చేసి బీసీలకు పెద్దన్నగా నిలిచిన సీఎం రేవంత్ :  చనగాని దయాకర్
  • పీసీసీ అధికార ప్రతినిధి చనగాని దయాకర్

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో కుల గణన చేసి సీఎం రేవంత్ రెడ్డి బీసీలకు పెద్దన్నగా నిలిచారని పీసీసీ అధికార ప్రతినిధి చనగాని దయాకర్ అన్నారు. శనివారం గాంధీభవన్ లో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ కులగణనతో రాష్ట్రంలోని బీసీలకు ఓ గొప్ప అవకాశం దక్కిందని తెలిపారు.

కాంగ్రెస్ మాజీ చీఫ్ రాహుల్ గాంధీ ఆలోచన మేరకు సీఎం రేవంత్ ఈ కుల గణన చేపట్టి తెలంగాణను ఆదర్శంగా నిలిపారని చెప్పారు. తెలంగాణలోని బీసీలను అన్ని రంగాల్లో అభివృద్ధి చేయాలనే తపన సీఎం రేవంత్ రెడ్డిలో ఉందని.. అందుకే ఆయన ఈ కుల గణన విషయంలో ప్రత్యేక శ్రద్ధ చూపారని పేర్కొన్నారు.