ఉద్యోగాల భర్తీపై చర్చిద్దాం రా..

ఉద్యోగాల భర్తీపై  చర్చిద్దాం రా..
  • పీసీసీ అధికార ప్రతినిధి చనగాని దయాకర్ సవాల్

హైదరాబాద్, వెలుగు: ఉద్యోగాల భర్తీపై చర్చకు సిద్ధమా అని బీఆర్ఎస్ నేత బాల్క సుమన్ కు పీసీసీ అధికార ప్రతినిధి చనగాని దయాకర్ సవాల్ విసిరారు. సోమవారం గాంధీ భవన్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. పదేండ్ల పాలనలో ఎన్ని ఉద్యోగ ప్రకటనలు ఇచ్చింది.. అందులో ఎన్ని భర్తీ చేసింది అనే దానిపై చర్చకు రావాలని డిమాండ్ చేశారు. అదే విధంగా తమ ప్రభుత్వం ఈ పది నెలల కాలంలో నిరుద్యోగులకు ఎంత వరకు న్యాయం చేసింది, ఎన్ని ఉద్యోగాలు ఇచ్చిందనే దానిపై చర్చించేందుకు తాము సిద్ధమన్నారు.

 రేవంత్ రెడ్డి నాయకత్వంలో గ్రూప్–1 ప్రిలిమ్స్ నిర్వహంచామని , 11 వేల టీచర్ పోస్టులను డీఎస్సీ ద్వారా భర్తీ చేశామని తెలిపారు. సివిల్ అండ్ అగ్రికల్చర్ పోస్టులు, గురుకుల పీజీటీ, జేఎల్ పోస్టులను 8 వేలను భర్తీ చేశామని చెప్పారు. నిరుద్యోగుల గురించి మాట్లాడే నైతిక హక్కు బాల్క సుమన్ కు లేదని దయాకర్ హెచ్చరించారు.