
- పీసీసీ అధికార ప్రతినిధి చనగాని దయాకర్
హైదరాబాద్, వెలుగు: సామాజిక న్యాయానికి బీఆర్‌ఎస్ పార్టీ తూట్లు పొడిచిందని పీసీసీ అధికార ప్రతినిధి చనగాని దయాకర్ అన్నారు. ఆదివారం గాంధీ భవన్‌లో మీడియాతో ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీతోనే సామాజిక న్యాయం జరుగుతుందని చెప్పారు. బీసీ కులగణనపై బీఆర్‌ఎస్ కనీసం స్పందించడం లేదని విమర్శించారు.
రేవంత్ నాయకత్వంలో తెలంగాణ దశ దిశమారుతుందని, యావత్ ప్రపంచం తెలంగాణ వైపు చూస్తున్నదని చెప్పారు. పదేండ్లు తెలంగాణలో అధికారంలో ఉండి రూ.వందల కోట్లు దోచుకుని, ఇప్పుడు ఆర్భాటాలు చేస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ పాలనలో తెలంగాణ రోజురోజుకూ అభివృద్ధి వైపు దూసుకెళ్తోందని తెలిపారు. తండ్రికొడుకుల డ్రామాలో హరీశ్ రావు బలయ్యారన్నారు.