కాంగ్రెస్ ఛలో రాజ్ భవన్: అదానీ అక్రమాలు, మణిపూర్ అల్లర్లపై నిరసనగా భారీ ర్యాలీ

కాంగ్రెస్ ఛలో రాజ్ భవన్: అదానీ అక్రమాలు, మణిపూర్ అల్లర్లపై నిరసనగా భారీ ర్యాలీ

పారిశ్రామిక దిగ్గజం గౌతమ్‌‌‌‌ అదానీ ఆర్థిక అక్రమాలు, మణిపూర్‌‌‌‌‌‌‌‌ అల్లర్లపై ఏఐసీసీ ఇచ్చిన మేరకు పీసీసీ ఆధ్వర్యంలో బుధవారం ( డిసెంబర్ 18, 2024 ) చలో రాజ్‌‌‌‌భవన్‌‌‌‌ కార్యక్రమానికి పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. అదానీ ఆర్థిక అవకతవకలు, నేరారోపణలు, అవినీతి, మోసం, మనీ లాండరింగ్ వంటి అంశాలతో పాటు మణిపూర్ అల్లర్లు, విధ్వంసాలపై మోదీ సర్కార్ వైఖరికి వ్యతిరేకంగా ఈ కార్యక్రమానికి పిలుపునిచ్చింది ఏఐసీసీ.

ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఏఐసీసీ ఇచ్చిన పిలుపులో భాగంగా చలో రాజ్ భవన్ కార్యక్రమాన్ని పీసీసీ నిర్వహిస్తోంది. హైదరాబాద్ లో  ఉదయం 11 గంటలకు పీసీసీ చీఫ్‌‌‌‌ మహేశ్‌‌‌‌ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో నెక్లెస్ రోడ్డులోని ఇందిరా గాంధీ విగ్రహం నుంచి రాజ్ భవన్ వరకు భారీ ర్యాలీ చేపట్టారు. ఇందులో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఏఐసీసీ ఇన్‌‌‌‌చార్జి దీపాదాస్ మున్షి, పలువురు మంత్రులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ సీనియర్ నాయకులు పాల్గొన్నారు.

ఈ క్రమంలో సీఎం రేవంత్ రెడ్డి రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు.ఈ ర్యాలీని విజయవంతం చేసేందుకు పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.