రాహుల్ ప్రతిపక్ష నేతగా ఎన్నికవడం శుభపరిణామం : నిరంజన్

రాహుల్ ప్రతిపక్ష నేతగా ఎన్నికవడం శుభపరిణామం : నిరంజన్

హైదరాబాద్, వెలుగు: కాంగ్రెస్ మాజీ చీఫ్ రాహుల్ గాంధీ లోక్ సభలో ప్రతిపక్ష నాయకుడిగా ఎన్నికవడం శుభ పరిణామని పీసీసీ ఉపాధ్యక్షుడు నిరంజన్ అన్నారు. రాహుల్ ఆ పదవిని సమర్థవంతంగా నిర్వహిస్తారని విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. బుధవారం గాంధీభవన్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రధాని మోదీతో సహా బీజేపీ నేతలు రాహుల్ ను ఎన్ని అవమానాలకు గురి చేసినా ఆయన హుందాగా వ్యవహరించారని గుర్తు చేశారు.

ప్రధాని మోదీకి ప్రతిపక్ష నాయకుడిగా రాహుల్ లోక్ సభలో ధీటుగా జవాబిస్తారన్నారు. రామ మందిరం నిర్మాణం చేయకుండానే ప్రారంభం చేశారని, దీనికి దేశ ప్రజలకు మోదీ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.