
- 27 ఇండ్లకు భూమి పూజ చేసిన పీసీసీ ఉపాధ్యక్షుడు
ఘట్ కేసర్, వెలుగు: ఘట్కేసర్ మున్సిపాలిటీ ఘనాపూర్, పీకల్టెకు, లింగాపూర్ తండాల్లో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి పీసీసీ ఉపాధ్యక్షుడు తోటకూర వజ్రేష్ యాదవ్ బుధవారం భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందించడమే ధ్యేయంగా పనిచేస్తున్నామన్నారు. బీఆర్ఎస్పదేండ్లలో చేయలేనిది తాము 14 నెలల్లోనే చేసి చూపించామన్నారు.
పైలట్‌ప్రాజెక్టులో భాగంగా ఘనాపూర్ లో 70 ఇళ్లు నిర్మిస్తున్నామని, ముందుగా 27 ఇండ్లకు భూమి పూజ చేశామని చెప్పారు. మాజీ ఎమ్మెల్యే మలిపెద్ది సుధీర్‌రెడ్డి, మున్సిపల్ కమిషనర్ చంద్రశేఖర్, కాంగ్రెస్నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.