
మేడిపల్లి, వెలుగు: తెలంగాణ దశాబ్ది ఉత్సవాలను మేడ్చల్ నియోజకవర్గంలో ఘనంగా జరుపుకోవాలని పీసీసీ ఉపాధ్యక్షుడు తోటకూర వజ్రేష్ యాదవ్ పిలుపునిచ్చారు. శనివారం ఆయన తన ఆఫీసులో మీడియతో మాట్లాడారు. నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో కాంగ్రెస్పార్టీ జెండాలు ఎగరవేయాలని సూచించారు. తెలంగాణ ఇచ్చింది సోనియా గాంధీ, తెచ్చింది కాంగ్రెస్ అని తెలిసేలా వేడుకలు జరపాలన్నారు.
ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున తగిన అనుమతులు తీసుకుని వేడుకలు జరుపుకోవాలన్నారు. కార్యక్రమంలో మేయర్లు, కార్పొరేటర్లు, చైర్మన్లు, కౌన్సిలర్లు, ఇతర నాయకులు భాగస్వాములు కావాలని సూచించారు.