- దానిని బాగు చేసేందుకు సీఎం చేస్తున్న కృషి భేష్: అంజన్ కుమార్
హైదరాబాద్, వెలుగు: మూసీ ప్రక్షాళనకు సీఎం రేవంత్ రెడ్డి చేస్తున్న కృషి అభినందనీయమని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ అన్నారు. మూసీ నీళ్లను గతంలో పశువులు తాగేవని, అవి అంత స్వచ్ఛంగా ఉండేవని తెలిపారు. మంగళవారం హైదరాబాద్ లో మీడియాతో ఆయన మాట్లాడారు.
మూసీతో తమకు దగ్గరి బంధం ఉండేదని చెప్పారు. మూసీ కబ్జాతో పశువులకు మేత దొరకడం లేదని, సిటీలో వాటి సంఖ్య అందుకే తగ్గిందని పేర్కొన్నారు. హైదరాబాద్ లో ఈ నెల 27న ఉదయం 11 గంటలకు సదర్ సమ్మేళనం నిర్వహిస్తున్నామని వెల్లడించారు. కుల, మతాలు, రాజకీయాలకు అతీతంగా దీన్ని నిర్వహిస్తున్నామని వివరించారు.