కేటీఆర్ దండుపాళ్యం గ్యాంగ్ లీడర్: జగ్గారెడ్డి

కేటీఆర్ దండుపాళ్యం  గ్యాంగ్ లీడర్: జగ్గారెడ్డి

హైదరాబాద్: బీఆర్ఎస్ సోషల్ మీడియా దండుపాళ్యం గ్యాంగ్ గా మారిందని..  ఆ గ్యాంగ్ కు కేటీఆర్ నాయకుడని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి విమర్శించారు. అక్టోబర్ 21న గాంధీభవన్ లో మాట్లాడిన ఆయన.. సీఎం తిడుతున్నాడు అంటే.. మీ కథలు అట్లున్నాయి.. కాబట్టి తిడతడు.. కేటీఆర్ బ్రాయిలర్ కోడి వ్యవహారం.. మేము నాటు కోడి టైపు.. కేటీఆర్ లెక్క అయ్య పేరు చెప్పు కొని రేవంత్ రెడ్డి సీఎం కాలేదు. రేవంత్ కి ఫుట్ పాత్ నుంచి తెలుసు.. నేను కూడా ఫుట్ పాత్ నుంచి వచ్చా
 నీకు అవన్నీ తెలియకుండా పెంచాడు కేసీఆర్  అని అన్నారు జగ్గారెడ్డి.

ALSO READ | జగిత్యాలలో కాంగ్రెస్​ నేత హత్య.. నిందితులను శిక్షించాలని ఎమ్మెల్సీ జీవన్​ రెడ్డి ఆందోళన

కేటీఆర్.. ఎలా తిట్టాలో రేవంత్ దగ్గరే ట్రైనింగ్ తీసుకో..  అర గంట, గంట టైం ఇవ్వమని రేవంత్ కి చెప్తా... అలాగే, దామగుండంనీ నేవీ ఎందుకు ఎంచుకుందో తెలుసా?.. రాడార్ వ్యవస్థలో 1000 కి లోమీటర్లలో ఉన్న సిగ్నల్ అందిస్తుంది.. సముద్ర మట్టానికి ఎత్తులో దామగుండం ఉంది కాబట్టి రాడార్ పెట్టారు.. ఇవన్నీ కేటీఆర్ కి తెలియదు.. అంతా బుక్ నాలెడ్జి అంటూ జగ్గారెడ్డి మండిపడ్డారు.