అధికారం పోయిన మైకం నుంచి హరీశ్ బయటకు రావాలె: జగ్గారెడ్డి

అధికారం పోయిన మైకం నుంచి హరీశ్ రావు బయటకు రావడం లేదని విమర్శించారు పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో వరద ప్రభావిత ప్రాంతాల్లో డిప్యూటి సీఎం భట్టి, మంత్రులు పొంగులేటి, తుమ్మల, మహబూబాబాద్ లో మంత్రి సీతక్క పర్యటిస్తూ సహాయక చర్యలు అందిస్తున్నారని తెలిపారు.

రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న చెరువుల పరిస్థితిపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సమిక్షిస్తున్నారని..సూర్యాపేట్, హుజుర్ నగర్ లో పర్యటిస్తున్నారని తెలిపారు. ప్రతిపక్షాల రాజకీయ విమర్శలకు ఇది సమయం కాదన్నారు .వరదలో 7వేల కోట్ల నష్టం జరిగిందన్నారు. తక్షణ సాయం కోసం కేంద్ర ప్రభుత్వం 2వేల కోట్లు విడుదల చేయాలని సీఎం రేవంత్ రెడ్డి ప్రధాని మోదీకి లేఖ రాశారని తెలిపారు జగ్గారెడ్డి.