హైదరాబాద్, వెలుగు: కేసీఆర్ సీఎంగా ప్రజలను కలవలేదు.. ప్రతిపక్ష నేతగా కూడా ప్రజల్లోకి వెళ్లడటం లేదని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి అన్నారు. అలాం టప్పుడు ఆయనకు రాజకీయాలు అవ సరం లేదని సూచించారు. కేసీఆర్ తన రాజకీయ జీవితంలో ఎప్పుడైనా మాటకు కట్టుబడి ఉన్నారా? అని ప్రశ్నించారు. రుణమాఫీలో సమస్యలకు కేసీఆరే కారణమని విమర్శించారు.
శుక్రవారం గాంధీ భవన్లో జగ్గారెడ్డి మీడియాతో మాట్లాడారు. ‘‘సీఎంగా కేసీఆర్ సెక్రటేరియెట్కు ఎన్నిసార్లు వెళ్లారో.. 9 నెలల్లో రేవంత్ సీఎంగా ఎన్ని రోజులు వెళ్లారనేది లెక్క తేల్చేందుకు బీఆర్ఎస్ నేతలు సిద్ధమా? ప్రభుత్వా నికి బ్యాంకర్లకు మధ్య ఉన్న ఆన్ లైన్ సిస్టంను కేసీఆర్ దెబ్బతీశారు’’అని జగ్గారెడ్డి అన్నారు.