సంగారెడ్డి అభివృద్ధిపైనే నా ఫోకస్​ : జగ్గారెడ్డి

సంగారెడ్డి అభివృద్ధిపైనే నా ఫోకస్​  : జగ్గారెడ్డి
  • కాంగ్రెస్​ పార్టీకి నా అవసరం లేదు: జగ్గారెడ్డి

హైదరాబాద్, వెలుగు: కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పార్టీకి తన అవసరం లేదని, సంగారెడ్డి అభివృద్ధిపైనే ఫోకస్ పెడతానని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి అన్నారు. రాష్ట్రంలో అధికారంలో తమ ప్రభుత్వమే ఉన్నందున సంగారెడ్డికి ఎక్కువ నిధులు తీసుకెళ్లి నియోజకవర్గాన్ని డెవలప్ చేస్తానని చెప్పారు. ఆదివారం గాంధీ భవన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో మీడియాతో ఆయన చిట్ చాట్ చేశారు. ఉగాదికి తన సినిమా షూటింగ్ స్టార్ట్ అవుతుందని, అప్పుడే సంగారెడ్డిపై అదే ప్రాంతానికి చెందిన మొగిలయ్య రాసిన పాటను రిలీజ్ చేస్తామని వెల్లడించారు.

సినిమాలో నటించాలని డైరెక్టర్ రామనుజం మూడు నెలల క్రితమే తనను కోరారని చెప్పారు. ప్రస్తుతం తాను రాజకీయాల్లో ఉన్నానని, అయితే, ఈ సినిమా వల్ల కొత్తగా తనకు రాజకీయాల్లో వచ్చే అడ్వాంటేజ్ ఏమీ లేదన్నారు. సినిమాలో స్టూడెంట్ లీడర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా, కౌన్సిలర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా, మున్సిపల్ చైర్మన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా ఎలా ఎదిగాననే విషయాన్ని చూపిస్తామని తెలిపారు. ఇటీవల ఢిల్లీ టూర్ తనను పూర్తిగా మార్చేసిందని, అక్కడి నుంచి వచ్చిన తర్వాతే ఈ సినిమాలో నటించాలని నిర్ణయించుకున్నానని చెప్పారు. అయితే, దీని పరిణామాలు ఎటు పోతాయో తనకు కూడా తెలియదన్నారు.