- ఆ రెండు పార్టీల విలీన ప్రక్రియ మొదలు కాబోతున్నదని వెల్లడి
బీజేపీ, బీఆర్ఎస్ కుమ్మక్కు రాజకీయంతోనే ఆమెకు బెయిల్ వచ్చింది. హరీశ్, కేటీఆర్ ఢిల్లీలో బీజేపీ నేతల చుట్టూ తిరిగి ఆపద మొక్కులు మొక్కారు. ఆ నేతల ఇండ్ల చుట్టూ తిరిగి కాళ్ల మీద పడి కవితకు బెయిల్ తెచ్చుకున్నారు. బీజేపీ, బీఆర్ఎస్ కుమ్మక్కు రాజకీయాలను తెలంగాణ ప్రజలు అర్థం చేసుకోవాలి. మొన్నటి వరకు చీకటి ఒప్పందాలతో కాంగ్రెస్ ను దెబ్బతీయాలని చూశారు.
ఎంపీ ఎన్నికల్లో బీజేపీకి బీఆర్ఎస్ దాసోహం అయింది. ఇక ఈ రెండు పార్టీల విలీన ప్రక్రియ మొదలు కాబోతోంది. కవిత బెయిల్ తో బీజేపీలో బీఆర్ఎస్ విలీనం ఒక్కటే మిగిలింది.
మహేశ్ కుమార్ గౌడ్, ఎమ్మెల్సీ, పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్