
లక్సెట్టిపేట, వెలుగు: లక్షెట్టిపేట మండలంలోని వెంకట్రావు పేట పెద్ద చెరువులోని బర్డ్ లేక్‌ను ఆదివారం పీసీసీఎఫ్ (ప్రిన్సిపల్ చీఫ్ కన్సర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్) డాక్టర్ సువర్ణ సందర్శించారు. పక్షి జాతులు, చెరువు పరిసరాలను పరిశీలించారు. అధికారులకు పలు సూచనలు చేశారు. సీఎఫ్ శాంతారాం, డీఎఫ్‌వో శివ్ ఆశిష్ సింగ్, ఎఫ్‌డీవో సర్వే శ్వర్, ఎఫ్ఆర్వో సుభాష్ పాల్గొన్నారు.