ఇవాళ (జనవరి) 5 నుంచి జిల్లాల టూర్లకు దీపాదాస్ మున్షీ, మహేశ్ గౌడ్

ఇవాళ (జనవరి) 5 నుంచి జిల్లాల టూర్లకు దీపాదాస్ మున్షీ, మహేశ్ గౌడ్

హైదరాబాద్, వెలుగు : పీసీపీ చీఫ్ ​మహేశ్ కుమార్ గౌడ్, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ చార్జ్ దీపాదాస్ మున్షీ, ఏఐసీసీ కార్యదర్శులు విష్ణునాథ్, విశ్వనాథ్ ఆదివారం నుంచి జిల్లాల్లో పర్యటించనున్నారు. ఆదివారం నాగార్జున సాగర్ లో ఆదివాసీ కాంగ్రెస్ సమావేశంలో పాల్గొంటారు. సోమవారం ఆదిలాబాద్,  మంగళవారం నిజామాబాద్ జిల్లాల్లో సమావేశాలకు హాజరై లోకల్ బాడీ ఎన్నికలు, ఎమ్మెల్సీ ఎన్నికలపై దిశా నిర్దేశం చేయనున్నారు.

ప్రజా పాలన విజయాలను జనంలోకి తీసుకెళ్లడంపై కేడర్ కు పలు సూచనలు ఇవ్వనున్నారు. ఈ సమావేశాల్లో జిల్లా మంత్రులు, ఇన్​చార్జ్ మంత్రులు, పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, డీసీసీ అధ్యక్షులు పాల్గొంటారు.