పనిదినాలు ప్రతిరోజు ఎంటర్ చేయాలి : పీడీ మధుసూదన్ రావు

పనిదినాలు ప్రతిరోజు ఎంటర్ చేయాలి : పీడీ మధుసూదన్ రావు

గూడూరు, వెలుగు: ఉపాధి హమీ పథకంలో పని చేస్తున్న కూలీల పనిదినాలను ప్రతి రోజు తప్పకుండా మస్టర్లో నమోదు చేయాలని పీడీ మధుసూదన్ రావు పీల్డ్ అసిస్టెంట్ల సూచించారు. మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలంలోని 39 గ్రామాలకు సంబంధించి 2023 నుంచి 2024 వరకు జరిగిన ఎంజీఎన్ఆర్ఈజీఎస్ పనులపై 15వ విడత ప్రజావేదికను ఎంపీడీవో కార్యాలయంలో ఏర్పాటు చేశారు. 

పీడీ మాట్లాడుతూ 2023 నుంచి 2024వరకు సంబంధించి మండలంలో మొత్తం పది కోట్ల 32లక్షల పనులు జరిగినట్లు తెలిపారు. ఆయా గ్రామ పంచాయతీల్లో లక్షా యాబైఏడు వేల రూపాయలు దర్వినియోగమయ్యాయని నిర్దారించారు. ఆయా నిధులను ఫీల్డ్ అసిస్టెంట్ల నుంచి రికవరీ చేయనున్నట్టు తెలిపారు.