అబ్దుల్లాపూర్​మెట్‌లో 27 టన్నుల రేషన్ బియ్యం సీజ్

అబ్దుల్లాపూర్​మెట్, వెలుగు: సిటీ శివారు అబ్దుల్లాపూర్​మెట్​లో 27 టన్నుల రేషన్ బియ్యాన్ని పోలీసులు సీజ్ చేశారు. సీఐ అంజిరెడ్డి వివరాల ప్రకారం.. ఎల్బీనగర్ కు చెందిన సయ్యద్ ఫియాజ్ ఇండ్ల నుంచి రేషన్ బియ్యాన్ని సేకరించి ఇతర రాష్ట్రాలకు తరలిస్తున్నాడు. పక్కా సమాచారంలో రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ సుర్మయ్ గూడ వద్ద నాగాలాండ్ కు చెందిన లారీని పోలీసులు ఆపి తనిఖీ చేశారు. అందులో 27 టన్నుల రేషన్ బియ్యం ఉండడంతో సీజ్ చేశారు. లారీ డ్రైవర్ బాలాజీ గుల్బాజీని అదుపులోకి తీసుకున్నామని, సయ్యద్ ఫియాజ్ పరారీలో ఉన్నట్లు తెలిపారు. అతడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.