
- పీడీఎస్ యూ నాయకులు
హనుమకొండ, వెలుగు: కేయూ పరిధిలో పెండింగ్లో పెట్టిన 117 ప్రైవేట్ డిగ్రీ కాలేజీల ఫలితాలను వెంటనే విడుదల చేయాలని పీడీఎస్యూ కాకతీయ యూనివర్సిటీ అధ్యక్షుడు బి.బాలకృష్ణ, ప్రధాన కార్యదర్శి వి.కావ్య డిమాండ్ చేశారు. గురువారం యూనివర్సిటీ వీసీ బిల్డింగ్ ఎదుట గురువారం ధర్నాకు దిగారు.
వీసీ ప్రతాపరెడ్డికి వినతిపత్రం అందించారు. యూనివర్సిటీకి బకాయిలు చెల్లించకపోవడం వల్లే ఫలితాలు నిలిపివేశామని అధికారులు చెప్పడం దారుణమన్నారు. విద్యార్థులు ఆందోళన చెందుతున్నారని, ఫలితాలు రిలీజ్ చేయాలని కోరారు. లేనిపక్షంలో పీడీఎస్యూ ఆధ్వర్యంలో ఉద్యమిస్తామని పేర్కొన్నారు. సంఘం ఉపాధ్యక్షులు గణేశ్, శ్రీచందన, సహాయ కార్యదర్శులు యాదగిరి నాయకులు పాల్గొన్నారు.