కల్వకుర్తి, వెలుగు: వెల్డండ మండలకేంద్రంలోని బీసీ హాస్టల్ సమస్యలు పరిష్కరించాలని పీడీఎస్ యూ రాష్ట్ర నాయకుడు సంతోష్ డిమాండ్ చేశారు. ఆదివారం పీడీఎస్ యూ ఆధ్వర్యంలో మండల కేంద్రంలోని బీసీ బాయ్స్ హాస్టల్ ను పరిశీలించారు. ఈ సందర్భంగా సంతోష్ మాట్లాడుతూ నాణ్యమైన భోజనం అందించాలని, హాస్టల్లో రిపేర్లు చేయించి, పెయింట్ వేయించాలని, మినరల్ వాటర్ ప్లాంట్, రూమ్స్ డోర్లు, కిటికీలు, ఫ్యాన్లు ఏర్పాటు చేయాలని, హాస్టల్ ఆవరణలోని మురికి కాలువను తొలగించాలని కోరారు.
అధికారులు, ప్రజాప్రతినిధులు సమస్యలు పరిష్కరించాలని, లేకపోతే విద్యార్థులతో కలిసి ఆందోళన చేస్తామని హెచ్చరించారు. కొమ్ము మధు, రమేశ్ యాదవ్ పాల్గొన్నారు.