ఓయూ, వెలుగు: మానవహక్కుల నేత బాలగోపాల్ స్ఫూర్తితో పోరాడుదామని పీడీఎస్యూ తెలంగాణ అధ్యక్షుడు ఎస్ నాగేశ్వరరావు పిలుపునిచ్చారు. పీడీఎస్యూ ఆధ్వర్యంలో మంగళవారం ఓయూ ఆర్ట్స్ కాలేజీవద్ద బాలగోపాల్ 15వ వర్ధంతి నిర్వహించారు. ఆయన ఫొటోకు పూలమాలలు వేసి నివాళులర్పించారు.
డాక్టర్ బాలగోపాల్, పౌర హక్కుల రక్షణ కోసం, మానవ హక్కుల పరిరక్షణ కోసం అవిరామంగా పోరాడారని గుర్తు చేశారు. దేశంలో హక్కుల అమలులో వివక్ష ఏర్పడితే బాలగోపాల్ గొంతుక ప్రజల తరుపున ప్రశ్నించిందని అన్నారు. కార్యక్రమంలో పీడీఎస్యూ నాయకులు సుమంత్, స్వాతి, రుక్మత్ పాషా, వెంకటేశ్, క్రాంతి, హరీశ్, శంకర్ తదితరులు పాల్గొన్నారు.