మెదక్ బస్సు డిపో ముందు ఆర్టీసీ కార్మికులు ఆందోళనకు దిగారు. విధులు బహిష్కరించి ఆందోళన చేపట్టారు. ఆర్టీసీ డ్రైవర్లను డిపో మేనేజర్ సుధా, సీఐ వేధింపులకు గురిచేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. డిపో ముందు 60 మంది డ్రైవర్లు స్వచ్ఛందంగా విధులు బహిష్కరించి శాంతియుతంగా నిరసన చేపట్టారు. టిమ్స్ డ్యూటీ చేయాలని నెల రోజుల నుంచి డిపో మేనేజర్, సీఐ వేధిస్తున్నారని కార్మికులు తెలిపారు.
తమ సమస్యలు పరిష్కరించాలని కోరారు. ఇంటిదగ్గర 10 గంటల కూడా ఉండలేకపోతున్నామని వాపోయారు కార్మికులు. హోటల్లో తిని డిపోలో పడుకుని డ్యూటీ చేస్తున్నమని ఆవేదన వ్యక్తం చేశారు. రెస్టు లేకుండా డ్యూటీ చేయడంతో 10 మంది డ్రైవర్లు అనారోగ్యం పాలై హాస్పిటల్లోఉన్నారని చెప్పారు. గతంలో ఒక ట్రిప్పు వేస్తే ఇప్పుడు రెండు వేయమంటున్నారని.. ఇబ్బందులకు గురిచేస్తున్నారని అన్నారు. భార్య పిల్లలను చూసుకోలేకపోతున్నామని చెప్పారు. ఒక వారం ముందు డిపో మేనేజర్ కు నోటిస్ అందజేశామని తెలిపారు.