వీధి కుక్కుల దాడిలో నెమలి మృతి

వీధి కుక్కుల దాడిలో నెమలి మృతి

కర్నూలు:  ఎక్కడో అటవీ ప్రాంతంలో సందడి చేసే జాతీయ పక్షి నెమలి దారితప్పి పొరపాటున గ్రామంలోకి ప్రవేశించి కుక్కల బారిన పడింది. నెమలిని కుక్కలు వెంటాడుతున్న దృశ్యాలను గమనించిన గ్రామస్తులు వెంటనే పరిగెత్తి నెమలిని వాటి నుంచి కాపాడారు. అనంతరం నెమలిని అటవీ శాఖ అధికారులకు అప్పగించేందుకు స్థానిక పోలీస్ స్టేషన్లో గ్రామస్తులు అప్పగించారు. కాని అప్పటికే తీవ్రగాయాల పాలైన ఆ నెమలి స్టేషన్ దగ్గర మృతి చెందింది. సాధారణంగా నెమళ్లు తమ గ్రామ సమీపంలోని రోళ్ళపాడు వన్యప్రాణి అభయారణ్యంలో కనిపిస్తు ఉంటాయని  గ్రామస్థులు చెబుతున్నారు. తమ గ్రామంలోకి వచ్చిన నెమలి నీరు లేదా ఆహారం కోసం వెతుక్కుంటూ వచ్చినట్లు వారు తెలిపారు.