జనావాసాల్లోకి నెమలి.. అటవీ అధికారులకు అప్పగింత

జనావాసాల్లోకి నెమలి..  అటవీ అధికారులకు అప్పగింత

రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో నెమలి జనావాసాల్లోకి వచ్చింది. గాంధీ చౌక్ దగ్గర ఉన్న బట్టల షాపులోకి వెళ్లింది. పక్కన ఉన్న బిల్డింగ్ పై నుంచి వచ్చి బట్టల దుకాణంలో ప్రవేశించడం స్థానికులు గమనించారు. షాపులోని నిర్వాహకులు నెమలిని చూసి ఆశ్చర్యపోయారు. చుట్టుపక్కల స్థానికులు అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. అయితే అధికారులు వెంటనే స్పందించలేదని స్థానికులు అంటున్నారు. దీంతో తామే పట్టుకొని అటవీశాఖ కార్యాలయంలో అప్పగించామని రాఘవేంద్ర కాలనీ వాసులు చెబుతున్నారు.