
- రెండు నెమళ్లు, 10 కేజీల మరో జంతువు మాంసం స్వాధీనం
మిర్యాలగూడ, వెలుగు : నెమలితో పాటు మరో జంతువు మాంసాన్ని అమ్ముతున్న వ్యక్తిని పోలీసులు అదుపులోకితీసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నల్గొండ జిల్లా వేములపల్లి మండలం శెట్టిపాలెం గ్రామానికి చెందిన నిమ్మల రమేశ్ కొంత కాలంగా ఇతర ప్రాంతాల నుంచి నెమలితో పాటు అడవి జంతువుల మాంసాన్ని తీసుకొచ్చి అమ్ముతున్నాడు.
విషయం తెలుసుకున్న పోలీసులు విక్రయ స్థావరంపై దాడి చేసి చనిపోయిన రెండు నెమళ్లతో పాటు మరో 10 ప్యాకెట్లలో నిల్వ చేసిన పది కేజీల అడవి జంతువు మాంసాన్ని స్వాధీనం చేసుకున్నారు. ప్యాకెట్లలో ఉన్నది ఏ జంతువు మాంసమో తెలుసుకునేందుకు ల్యాబ్‌కు పంపించారు. నెమళ్లతో పాటు అడవి జంతువు మాంసాన్ని ఎక్కడి నుంచి తీసుకొచ్చారు ? ఈ వ్యవహారంలో ఎంత మంది ఉన్నారు ? అనే విషయంపై విచారణ చేస్తున్న ఎస్సై డి.వెంకటేశ్వర్లు తెలిపారు.