వీల్చైర్ లేక ఆస్పత్రిపాలైన లెఫ్టినెంట్ జనరల్ భార్య..ఎయిర్ ఇండియాపై ప్యాసింజర్ల ఆగ్రహం

వీల్చైర్ లేక ఆస్పత్రిపాలైన లెఫ్టినెంట్ జనరల్ భార్య..ఎయిర్ ఇండియాపై ప్యాసింజర్ల ఆగ్రహం

ఎయిర్ ఇండియా వీల్ చైర్ల కొరత..ముందస్తుగా బుక్ చేసుకున్నా అందుబాటులో లేవు. అర్థగంట పాటు వేచివున్న ప్యాసింజర్..వీల్ చైర్ దొరక్క పోవడంతో నడిచేందుకు యత్నించి మైకం కమ్మి కిందదపడటంతో తీవ్రగాయాలు..ఐసీయూలో చికిత్స పొందుతోంది..ఈ ఘటన ఇదంతా ఢిల్లీ ఎయిర్ పోర్టులో శనివారం (మార్చి8) మహిళా దినోత్సవం రోజున జరిగింది.వివరాల్లోకి వెళితే.. 

శనివారం మధ్యాహ్నం ఢిల్లీలో ఎయిర్ పోర్టులో 82యేళ్ల వృద్దురాలు ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. ఎయిర్ ఇండియాలో ముందస్తుగా బుక్  చేసుకున్నప్పటికీ వీల్ చైర్ అందించకపోవడంతో సొమ్మసిల్లిన వృద్దురాలు కిందపడి పోయింది. తీవ్రగాయాలతో ఇంటెన్సివ్ కేర్ లో చికిత్స పొందుతోంది. మెదడు రక్తస్రావం జరిగినట్లు డాక్టర్లు చెబుతున్నారు. 

ఈ ఘటనపై బాధితురాలి కుటుంబ సభ్యులు  ఆగ్రహం వ్యక్తం చేశారు. వృద్ధురాలు.. పైగా మహిళ.. ఆపై  ఓ లెఫ్ట్ నెంట్ జనరల్ భార్య..అయినప్పటికీ ఒక్క వీల్ చైర్ ఏర్పాటు చేయలేకపోయారు. సొమ్మసిల్లి మా అమ్మమ్మ కిందపడటంతో పెదవి, తలకు తీవ్రగాయాలయ్యాయి. రక్తంపోయింది. ఎలాంటి ప్రథమ చికిత్స లేకుండా విమానం ఎక్కించారు. ఆమె ప్రస్తుతం ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. బాధితురాలి మనవరాలు ఎయిర్ ఇండియాపై ఆగ్రహం వ్యక్తం చేసింది. 

ALSO READ | యూనివర్సిటీలో నార్త్ Vs సౌత్ స్టూడెంట్స్: చపాతీల విషయంలో పిచ్చపిచ్చగా కొట్టుకున్నారు..!

సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ X లో బాధితురాలి మనవరాలు కన్వర్ తన కోపాన్ని వ్యక్తం చేస్తూ "మీరు నా అమ్మమ్మను చాలా దారుణంగా హింసించారు. అస్సలు పట్టించుకోలేదు. మీరు సిగ్గుపడాలి" అని రాశారు.

ఈ దారుణాన్ని వివరిస్తూ..మార్చి 4న ఢిల్లీ నుంచి బెంగళూరుకు వెళ్లే విమానం కోసం కుటుంబం వీల్‌చైర్‌ను ఎలా ముందుగానే బుక్ చేసుకున్నారో ఆమె వివరించింది. అయితే విమానాశ్రయానికి చేరుకున్న తర్వాత, ఎయిర్ ఇండియా సిబ్బందికి, విమానాశ్రయ హెల్ప్ డెస్క్‌కు ,ప్రత్యామ్నాయ విమానయాన సిబ్బందికి కూడా పదేపదే రిక్వెస్ట్ చేసినా వీల్‌చైర్ కేటాయించలేదని ఆవేదన వ్యక్తం చేసింది. 

ఎయిర్ ఇండియా నిర్లక్ష్యంపై బాధితురాలి కుటుంబ సభ్యులు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) , ఎయిర్ ఇండియాకు ఫిర్యాదులు చేశారు. వారి స్పందన కోసం ఎదురు చూస్తున్నారు.