పెబ్బేరులో నేషనల్​ క్రికెట్​ టోర్నీ విజేతల సంబురాలు

పెబ్బేరు, వెలుగు: యూపీలోని లక్నోలో అండర్–15 టీ-10 నేషనల్​ క్రికెట్​ టోర్నీలో విజేతలుగా నిలిచిన వనపర్తి జిల్లా పెబ్బేరు టీమ్ ఆదివారం పట్టణంలో సంబురాలు చేసుకుంది. కప్, జాతీయ జెండాలతో పట్టణంలో ఓపెన్​ టాప్​ జీప్​లో ర్యాలీ చేశారు. ఒకరికొకరు స్వీట్స్​ తినిపించుకొని, పటాకులు కాల్చారు. పేరెంట్స్, పట్టణ ప్రముఖులు, ప్రజలు వారిని పూలమాలతో సత్కరించి అభినందనలు తెలిపారు. టీమ్​ కెప్టెన్  చరణ్, ప్లేయర్స్​ సాక్షిక్, మహేశ్, భీష్మంత్, చందు, పరశురాముడు, అఫ్రోజ్, యోగేశ్వర్, ఫర్హాన్  రేహాన్, గణేశ్, కోచ్​ శంకర్, మనోహర్​ పాల్గొన్నారు.