ధర్మసాగర్, వెలుగు : స్టేట్ లెవల్ వాలీబాల్ పోటీలకు ధర్మసాగర్ మండలం పెద్దపెండ్యాల స్టూడెంట్ ఎంపికయ్యాడు. వరంగల్‌లోని శంభునిపేట హైస్కూల్‌లో ఇటీవల జరిగిన ఉమ్మడి జిల్లా స్థాయి అండర్ 14 వాలీబాల్ పోటీల్లో పెద్ద పెండ్యాల స్టూడెంట్ బచ్చలకూరి వర్షిత్ ప్రతిభ కనబరిచి స్టేట్ లెవల్‌కు ఎంపికయ్యాడు.
వర్షిత్ ఈ నెల 13 నుంచి 15 వరకు నారాయణపేట జిల్లాలో జరిగే రాష్ట్రస్థాయి పోటీలకు హాజరుకానున్నారు. స్టూడెంట్ వర్షిత్, పీఈటీ సుధాకర్‌ను హెచ్‌ఎం బత్తిని రాజేందర్, సర్పంచ్ ఆకారపు అన్నమ్మ, ఉపసర్పంచ్ శివకర్‌రెడ్డి అభినందించారు.