ముగిసిన నెలవారం.. తరలిన దేవరపెట్టె

ముగిసిన నెలవారం.. తరలిన దేవరపెట్టె
  • నేడు పెద్దగట్టు జాతర ముగింపు 

సూర్యాపేట, వెలుగు :  పెద్దగట్టు లింగమంతుల స్వామి జాతరలో బుధవారం దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో నెలవారం ఘనంగా నిర్వహించారు. మెంతబోయిన వంశస్తులు నిద్ర ఘట్టంలో భాగంగా కేసారం చేరుకొని అక్కడి నుంచి ఉదయాన్నే లేచి పెద్దగట్టుకు వచ్చారు. చంద్రపట్నం వద్ద మొక్కులు చెల్లించి దేవరపెట్టెను కదిలించారు. 

అనంతరం చౌడమ్మ తల్లికి నెలవారం పిల్లను బలిచ్చి గొర్రె మాంసాన్ని మున్నా, మెంతబోయిన, బైకాన్లు మూడు భాగాలు పంచుకొని ప్రసాదంగా స్వీకరించారు. దీంతో నెలవారం పూర్తి అయింది. అనంతరం దేవరపెట్టెను కేసారానికి తరలించారు. దేవరపెట్టె వెళ్తుండడంతో భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.