పెద్దగట్టు జాతరను రాష్ట్ర పండుగగా గుర్తించాలి : గోవర్ధన్ యాదవ్

  •     అఖిలభారత యాదవ మహాసభ 
  •     రాష్ట్ర కార్యదర్శి గోవర్ధన్ యాదవ్ 

నల్గొండ అర్బన్, వెలుగు : పెద్దగట్టు(గొల్లగట్టు) జాతరను రాష్ట్ర పండుగగా గుర్తించాలని, జాతర నిర్వహణకు రూ.100 కోట్లు కేటాయించాలని అఖిల భారత యాదవ మహాసభ రాష్ట్ర కార్యదర్శి ఎల్.గోవర్ధన్ యాదవ్ డిమాండ్ చేశారు. శుక్రవారం నల్గొండలోని యాదవ సంఘం భవన్ లో సంఘం నూతన క్యాలెండర్ ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికలు, నామినేట్ పదవుల్లో యాదవులకు సముచిత స్థానం కల్పించాలని కోరారు. గొర్రెలకాపరులకు సహకార సంఘాల సభ్యులకు ప్రమాద బీమా స్కీంను కొనసాగించాలని విజ్ఞప్తి చేశారు.

గత ప్రభుత్వం హయాంలో గొర్రెలకారులకు కేటాయించిన స్కీంను కొనసాగించాలని, యూనియన్ ఎన్నికలను నిర్వహించాలన్నారు. జిల్లాలో అన్ని రాజకీయ పార్టీలు సంస్థాగత పదవులో యాదవులకు సరైన ప్రాతినిధ్యం కల్పించాలని కోరారు. కార్యక్రమంలో మహాసభ రాష్ట్ర నాయకులు ఎస్ సుధాకర్ యాదవ్, ఎల్బీ యాదవ్, జిల్లా అధ్యక్షుడు ముచ్చర్ల ఏడుకొండల్​ యాదవ్, నాయకులు తదితరులు పాల్గొన్నారు.