![హైదరాబాద్ - విజయవాడ హైవే పై ట్రాఫిక్ ఆంక్షలు](https://static.v6velugu.com/uploads/2025/02/peddagattu-jatara-traffic-diversion-on-hyderabad-vijayavad-highway_ZWwF4N7B0b.jpg)
- తెలంగాణ లోనే రెండో అతిపెద్ద జాతర దురాజుపల్లి పెద్దగట్టు జాతర సందర్భంగా సూర్యాపేట జిల్లా ఎస్పీ సన్ ప్రీత్ సింగ్ సమీక్ష నిర్వహించారు. పెద్దగట్టు జాతర సందర్భంగా విజయవాడ- - హైదరాబాద్ హైవే (NH 65) పై ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నట్లు పోలీసులు ప్రకటించారు. జాతర ఫిబ్రవరి 16వ నుంచి ప్రారంభం కానుండటంతో భక్తులు ఎక్కువగా వచ్చే అవకాశం ఉన్నందున ట్రాఫిక్ ను డైవర్ట్ చేస్తున్నారు.
ఈ సందర్భంగా ఎస్పీ సన్ ప్రీత్ సింగ్ చెప్పిన వివరాలు:
* జాతీయ రహదారిపై వాహనాల మళ్లింపు, జాతరకు వచ్చే వాహనాల పార్కింగ్ స్థలాలకు సంబంధించి రూట్ మ్యాప్ లను సిద్దం చేశాం.
• రోజు మూడు విడతల్లో 24 గంటలు పోలీసు బందోబస్తు నిర్వర్తిస్తాం.
ఫిబ్రవరి 16 వ తేది నుండి 65 వ నెంబర్ జాతీయ రహదారి పై అక్షలు ఉంటాయి.
• నార్కట్ పల్లి వద్ద :- హైదరాబాద్ నుండి విజయవాడ వైపు వెళ్లే వాహనాలు నార్కట్ పల్లి నుండి నల్గొండ వైపు గా.. మిర్యాలగూడ, హుజూర్నగర్, కోదాడ మీదుగా విజయవాడ కు వెళ్లొచ్చు
కోదాడ వద్ద :- విజయవాడ నుండి హైదరాబాద్ వెళ్ళే వాహనాలను, కోదాడ వద్ద మళ్లించి హుజూర్నగర్, మిర్యాలగూడ, నల్గొండ, నార్కట్ పల్లి మీదుగా హైద్రాబాద్ మళ్ళింపు
• హైద్రాబాద్ నుండి ఖమ్మం వెళ్ళే వాహనాలను టేకుమట్ల వద్ద జాతీయరహదారి 365 BB మీదుగా వెళ్లాలి.
సూర్యాపేట-కోదాడ వెళ్ళే వాహనాలు:
కోదాడ, మునగాల, గుంపుల మీదుగా సూర్యాపేట పట్టణానికి వచ్చే RTC బస్సులు, ఇతర చిన్న ప్రజా రవాణా వాహనాలు SRSP కెనాల్, బీబిగుడెం నుండి సూర్యాపేట పట్టణానికి మళ్లింపు
సూర్యాపేట పట్టణం నుండి కోదాడ వెళ్ళే RTC బస్సులు:
* ఆర్టీసీ బస్సులను కుడ కుడ గ్రామం మీదుగా ఐలాపురం.. అటునుంచి ఖమ్మం జాతీయ రహదారి మీదుగా రాఘవపురం స్టేజి నుండి నామవరం గ్రామం మీదుగా జాతీయరహదారి 65 పై గుంజలూరు స్టేజి వరకు మళ్లించి కోదాడ, విజయవాడ వైపుకు పంపించడం జరుగుతుంది.
- జాతరకు వచ్చే భక్తులకు ప్రత్యేక పార్కింగ్ ఏర్పాటు చేశాం.