ప్రజలు బాగుండాల.. లింగమతుల స్వామిని ప్రార్థించిన మంత్రి ఉత్తమ్​

ప్రజలు బాగుండాల.. లింగమతుల స్వామిని ప్రార్థించిన మంత్రి ఉత్తమ్​

సూర్యాపేట జిల్లా  చివ్వేంల మండలం దురాజ్ పల్లి... పెద్దగట్టు జాతరలో  లింగమంతుల స్వామిని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి దర్శించుకున్నారు.  స్వామి ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు.  అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ... లింగమంతుల జాతరకు రాష్ట్ర ప్రభుత్వం 5 కోట్ల రూపాయలు కేటాయించిందని తెలిపారు.  జాతరకు వచ్చే భక్తులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా అన్నీ ఏర్పాట్లు చేశామని మంత్రి ఉత్తమ్​ కుమార్​ రెడ్డి తెలిపారు. 

 రాష్ట్రంలో ప్రతి ఒక్కరు , రైతులు సుభిక్షంగా ఉండాలని స్వామిని ప్రార్థించాన్నారు.  తాను ఈ ప్రాంతంలో పుట్టి.. ఇక్కడే పెరిగానన్నారు.  చిన్నప్పటి నుంచి పెద్దగట్టు జాతర చూస్తున్నాన్నారు. తనకోసం ఏం కోరుకోనని..   ప్రజలు బాగుండాలని మొక్కులు చెల్లించానని మంత్రి అన్నారు.