ఓఆర్ఆర్ ఎగ్జిట్​ నం.15 నుంచి రాకపోకలు ప్రారంభం

ఓఆర్ఆర్ ఎగ్జిట్​ నం.15 నుంచి రాకపోకలు ప్రారంభం

ఓఆర్ఆర్ ఎగ్జిట్​ నం.15 నుంచి రాకపోకలు ప్రారంభం

నరసింహ చెరువుకు గండి కొట్టిన అధికారులు

శంషాబాద్, వెలుగు: పెద్దగోల్కొండ ఓఆర్ఆర్ ఎగ్జిట్​నం.15 నుంచి శుక్రవారం రాకపోకలు తిరిగి ప్రారంభం అయ్యాయి. శంషాబాద్ మండలంలోని చిన్న గోల్కొండ నరసింహ చెరువుకు అధికారులు గండికొట్టి నీటిని దిగువకు వదిలారు. దీంతో ఎగ్జిట్​నం.15 వద్ద నిలిచిన వరద నీరు పైపుల ద్వారా కొద్దికొద్దిగా చెరువులోకి వెళ్తోంది. నెల రోజులకు పైగా నిలిచిపోయిన రాకపోకలు తిరిగి ప్రారంభం కావడంతో చుట్టుపక్కల రైతులు, గ్రామస్తులు ఆనందం వ్యక్తం చేశారు. అయితే మొదట చెరువుకు గండి కొట్టేందుకు చిన్నగోల్కొండ రైతులు ఒప్పుకోలేదు.

స్థానిక ఎమ్మెల్యే సర్పంచ్, గ్రామస్తులతో మాట్లాడి ఒప్పించారు. దీంతో గురువారం అర్ధరాత్రి తర్వాత నీటి తొలగింపు ప్రక్రియ మొదలైంది. వరద మొత్తం పోయేందుకు రెండు రోజులు పట్టేలా ఉంది.