మోపాల్, వెలుగు: మోపాల్ మండలం ముదక్పల్లి గ్రామంలోని పెద్దమ్మ తల్లి ఆలయ ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. వార్షికోత్సవాల్లో భాగంగా అమ్మవారి మూలవిరాట్‌కు సంప్రదాయ పూజలు చేసిన అర్చకులు, నైవేద్యాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు.
ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో మహాయాగం నిర్వహించారు. ఉత్సవాల్లో పాల్గొన్న కాంగ్రెస్అభ్యర్థి భూపతిరెడ్డి, నాయకులు ముప్ప గంగారెడ్డి, యాదగిరి, శేఖర్‌గౌడ్ తదితరులు అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు.