- శనివారం నుంచే అందుబాటులోకి పెద్దమ్మ గుడి మెట్రో స్టేషన్
- అమీర్ పేట్ – హైటెక్ సిటీ మధ్య ఆరు స్టాప్ లు
- ముస్తాబవుతున్న మరో రెండు స్టాప్ లు
హైటెక్ సిటీ – అమీర్ పేట్ మెట్రో మార్గంలో మరో స్టేషన్ అందుబాటులోకి రానుంది. శనివారం నుంచి పెద్దమ్మ గుడి దగ్గర నిర్మించిన స్టేషన్ ను ప్రయాణికులకు అందుబాటులోకి తీసుకొస్తుంది మెట్రో.
అమీర్ పేట నుంచి హైటెక్ సిటీ మార్గంలో మొత్తం 8 మెట్రో స్టేషన్లు ఉండాలి. ప్రస్తుతం 5 చోట్ల మాత్రమే మెట్రో ఆగుతోంది.. ఈ రూట్ లో మలుపులు, ఎత్తుపల్లాలు ఎక్కువగా ఉండటం, హైటెక్ సిటీ దగ్గర రివర్సల్ లేకపోవడంతో ట్విన్ సింగిల్ విధానంలోనే ట్రైన్స్ ను ఆపరేట్ చేస్తున్నారు. దీంతో మూడు స్టేషన్లలో ప్రయాణికులను అనుమతించడం లేదు.
అయితే శనివారం నుంచి పెద్దమ్మతల్లి టెంపుల్ దగ్గర మెట్రోను ఆపనున్నారు. త్వరలోనే మిగిలిన జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్, మాదాపూర్ స్టేషన్లను ఓపెన్ చేయనున్నట్లు మెట్రో అధికారులు తెలిపారు.