బాల్కొండలో పెద్దమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ఠాపన

బాల్కొండలో పెద్దమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ఠాపన

బాల్కొండ, వెలుగు : బాల్కొండ మండల కేంద్రంలో ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో నూతనంగా నిర్మించిన ఆలయంలో పెద్దమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ఠాపన ఆదివారం ఘనంగా నిర్వహించారు. స్థానిక పురోహితుడు ప్రకాశ్​ జోషి వైదిక బృందం వేదమంత్రోచారణ మధ్య కార్యక్రమం వైభవంగా కొనసాగింది. భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై పూజలు చేశారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. రాత్రి భజన కార్యక్రమాలు కొనసాగాయి. 

ఎమ్మెల్యే వేముల పూజలు

పెద్దమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమానికి మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి, టీజీఎండీసీ చైర్మన్ ఈరవత్రి అనిల్, కాంగ్రెస్ నేత ముత్యాల సునీల్ కుమార్ వేర్వేరుగా పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆలయ అభివృద్ధికి తమ వంతు సహకారం అందిస్తామన్నారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అతిథులను శాలువాలతో సత్కరించి పెద్దమ్మ ఆలయ ఫొటోను బహుకరించారు.