పెద్దమ్మతల్లికి  పంచామృతాభిషేకం

పాల్వంచ రూరల్, వెలుగు: మండలంలోని కేపీ జగన్నాథపురం గ్రామంలో  కొలువుదీరిన పెద్దమ్మతల్లికి శుక్రవారం పంచామృతాలతో వైభవంగా అభిషేకం చేశారు. ఆలయ అర్చకులు, భక్తులు అమ్మవారి జన్మస్థలం వద్ద పసుపు, కుంకుమ, గాజులు, హారతి, నివేదన, నీరాజన, పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయ ఈవో రజనీకుమారి, ధర్మకర్తల మండలి అధ్యక్షుడు మహాపతి రామలింగం, సభ్యులు కిలారు నాగేశ్వరరావు, చింతా నాగరాజు, గంధం వెంగళరావు, అర్చకులు, సిబ్బంది పాల్గొన్నారు.