
పాల్వంచ, వెలుగు : మండలంలోని కేపీ జగన్నాథపురంలో ఉన్న పెద్దమ్మతల్లి ఆలయానికి ఆదివారం భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. వివిధ ప్రాంతాలకు వెళ్లే భక్తులు వాహన పూజలు చేయించుకున్నారు. అమ్మవారికి పొంగళ్లు, నైవేద్యాలు, పసుపు, కుంకుమ, గాజులు, హారతి సమర్పించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ పూజలో ఈవో రజనీ కుమారి, అర్చకులు, పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.