పెద్దమ్మ తల్లి ఉత్సవాల పోస్టర్ల ఆవిష్కరణ

పెద్దమ్మ తల్లి ఉత్సవాల పోస్టర్ల ఆవిష్కరణ

పాల్వంచ, వెలుగు : మండలంలోని పెద్దమ్మతల్లి ఆలయ మహా కుంభాభిషేకం వాల్ పోస్టర్లను కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు బుధవారం ఆవిష్కరించారు. ఆలయ నిర్మాణం జరిగి 60 ఏండ్లు పూర్తి చేసుకున్న నేపథ్యంలో పంచమ పుష్కర మహా కుంభాభిషేకం పేరిట ఫిబ్రవరి 6 నుంచి 10 వరకు ఉత్సవాలు నిర్వ హించనున్నారు. దీంతోపాటు ఆలయ ప్రాంగణంలో నిర్మాణం పూర్తి చేసుకున్న శివాలయం విగ్రహ ప్రతిష్ఠాపన జరగనుంది. ఈ కార్యక్రమంలో ఈవో రజినీ కుమారి, అర్చకులు పాల్గొన్నారు.