హనుమకొండ, వెలుగు : రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రాగానే హనుమకొండలోని పెద్దమ్మగడ్డను మోడల్ కాలనీగా మారుస్తామని ఆ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఏనుగుల రాకేశ్‌రెడ్డి చెప్పారు. బీజేపీ బస్తీ బాట కార్యక్రమంలో భాగంగా ఆదివారం పెద్దమ్మగడ్డలో ఆయన పర్యటించి ప్రజా సమస్యలను తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పెద్దమ్మగడ్డను బీఆర్‌ఎస్ లీడర్లు గాలికొదిలేశారన్నారు.
దళిత బంధు ఆశచూపి ప్రజల జీవితాలతో ఆడుకుంటున్నారని, స్థానిక ప్రజలను ఓట్ల కోసమే వినియోగించుకుంటున్నారని మండిపడ్డారు. బీజేపీకి అవకాశం ఇస్తే పెద్దమ్మ గడ్డ రూపురేఖలు మారుస్తామని చెప్పారు. ఆయన వెంట నాయకులు దేవయ్య, బూత్ అధ్యక్షుడు అశోక్, నాయకులు మహేందర్ వెంకట్, ప్రభువాసు, రాజు, కళ్యాణ్, రజిని, కౌసల్య పాల్గొన్నారు.