తిప్పనపల్లిలో పెద్దమ్మతల్లి సరువుల జాతర

తిప్పనపల్లిలో  పెద్దమ్మతల్లి సరువుల జాతర

చండ్రుగొండ, వెలుగు : మండలంలోని తిప్పనపల్లిలో గిరిజనులు ఆరాద్యదైవమైన పెద్దమ్మతల్లి సరువుల జాతర శనివారం ఘనంగా జరిగింది. భక్తులు సమీప అడవి నుంచి సరువులను తీసుకొచ్చి మేలతాళాలతో సాంప్రదాయ నృత్యాలతో ఊరేగింపుగా ఆలయానికి తీసుకొచ్చారు. రెండేండ్లకోసారి జరిగే ఈ జాతర ప్రాచూర్యం పొందింది. ఆదివారం ఉదయం అగ్ని గుండం ప్రవేశం, అమ్మవారి కల్యాణం వైభవోపేతంగా జరగనుంది.