పెద్దపల్లిలో దారుణం...కిటికీలోంచి పెట్రోల్ పోసి నిప్పు పెట్టి హత్య

పెద్దపల్లి జిల్లాలో దారుణ హత్య జరిగింది. ఆస్తికోసం సొంత అన్ననే పెట్రోల్ పోసి నిప్పటించారు. అర్థరాత్రి ఇంట్లో నిద్రిస్తుండగా కిటికీలోంచి పెట్రోల్ పోసి నిప్పంటించి సజీవ దహనం చేశారు. ధర్మారం మండలం కొత్తూరుకు చెందిన గాలిపెళ్లి అశోక్(38) అర్థరాత్రి ఇంట్లో నిద్రిస్తుండగా.. అతని తమ్ముడు నరేష్, చెల్లెలు పుష్పలత, బావ అనిల్ ఈ దారుణానికి పాల్పడినట్లు గ్రామస్తులు తెలిపారు. అశోక్ దారుణ హత్యపై ఆగ్రహించిన గ్రామస్తులు నిందితులు నరేష్, పుష్పలత, అనిల్ ను చితకబాదారు. అనంతరం పోలీసులకు అప్పజెప్పారు. నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

ALSO READ :అత్యాచారం కేసులో..నిందితుడికి పదేళ్ల జైలు

తమ్ముడు నరేష్,  చెల్లెలు పుష్పలత, ఆమె భర్త అనిల్ ల నుంచి తనకు ప్రాణభయం ఉందని అశోక్ 10 రోజుల క్రితమే పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసినట్లు బంధువులు తెలిపారు. శోక్ మృతి సమయంలో నరేష్, పుష్పలత, అనిల్ పక్క రూంలోనే  పడుకున్నారు. మృతుడు అశోక్ తమ్ముడు నరేష్, చెల్లెలు పుష్పలత, బావ అనిల్ ను పోలీసులు విచారిస్తున్నారు.