పెద్దపల్లి జిల్లా పాలకుర్తి మండలంలోని బసంత్ నగర్ కేశోరాం సిమెంట్ ఫ్యాక్టరీలో ప్రమాదం జరిగింది. ఫ్యాక్లరీలో ప్రమాదవశాత్తు కాంట్రాక్టు కార్మికుడు పరశురాం మృతి చెందాడు. అయితే యాజమాన్యం నిర్లక్ష్యం కారణంగానే కార్మికుడు మృతి చెందినట్లు కార్మిక సంఘం నాయకుల ఆరోపిస్తున్నారు.
కుటుంబ సభ్యులతో కలసి కార్మికులు ఫ్యాక్టరీ గేట్ ముందు బైఠాయించి ఆందోళన చేపట్టారు. మృతుని కుటుంబానికి 40 లక్షల రూపాయల నష్టపరిహారం చెల్లించాలని కార్మిక సంఘం నాయకులు డిమాండ్ చేశారు. మృతుని స్వస్థలం తక్కళ్లపల్లి గ్రామం కాగా, మృతునికి భార్య, కొడుకు, కూతురు ఉన్నారు.