సుల్తానాబాద్, వెలుగు : గ్రామాల్లో శానిటేషన్ పనులపై ఫోకస్ పెట్టాలని పెద్దపల్లి కలెక్టర్ కోయ శ్రీహర్ష అధికారులను ఆదేశించారు. మంగళవారం సుల్తానాబాద్ ఎంపీడీవో ఆఫీస్‌లో శానిటేషన్, తాగునీటి సరఫరా, మొక్కల పెంపకం, వైరల్ జ్వరాల నివారణ, పాఠశాల విద్య తదితర అంశాలపై అడిషనల్ కలెక్టర్ అరుణశ్రీ తో కలిసి అధికారులతో రివ్యూ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఫ్రైడే డ్రై డే ను కట్టుదిట్టంగా అమలు చేయాలన్నారు.
గ్రామాల్లో డార్క్ ఏరియా లేకుండా స్ట్రీట్ లైట్స్ పెట్టాలన్నారు. అనంతరం సుల్తానాబాద్ హాస్పిటల్‌ను సందర్శించారు. ఆయన వెంట జిల్లా హాస్పిటల్ సూపరింటెండెంట్ శ్రీధర్, సుల్తానాబాద్ సూపరింటెండెంట్ రమాదేవి, స్పెషల్ ఆఫీసర్ జగన్మోహన్ రెడ్డి, ఎంపీడీవో దివ్య దర్శన్ రావు, తహసీల్దార్ మధుసూదన్ రెడ్డి ఉన్నారు.