నిరుద్యోగులకు ఉపాధి కల్పించడమే తన లక్ష్యమన్నారు పెద్దపల్లి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ. గోదావరి ఖనిలో పెద్దపల్లి ఎంపీ ఎన్నికల సన్నాహాక సమావేశంలో మాట్లాడిన ఆయన.. అమరవీరుల బలిదానాల మీద కేసీఆర్ పదేండ్లు పాలించారని విమర్శించారు. కేసీఆర్ తీరుతో రాష్ట్రం నిరుద్యోగులకు నిలయంగా మారిందన్నారు. మీ ఇంట్లో నేను చిన్న కొడుకుగా సేవ చేస్తానని చెప్పారు. 80 శాతం ఉద్యోగాలు స్థానికులకు కల్పిస్తామని చెప్పారు వంశీకృష్ణ.
మీ అందరి ఆశీర్వాదంతోనే కాంగ్రెస్ అధిష్టానం తనకు పెద్దపల్లి టికెట్ ఇచ్చిందన్నారు గడ్డం వంశీకృష్ణ. మీరు కోరుకున్నారు కాబట్టే తాను ఇక్కడ ఉన్నానని చెప్పారు. సింగరేణిలో లక్ష ఉద్యోగాలు కాపాడిన చరిత్ర కాకా వెంకటస్వామిదన్నారు. కాకానే తొలిసారిపెన్షన్ల స్కీం తెచ్చారు.. కాకా హయాంలోనే రేషన్ సిష్టమ్ ను తీసుకొచ్చారని తెలిపారు. సింగరేణి సమస్యలపై తనకు పూర్తి అవవగాహన ఉందన్నారు వంశీకృష్ణ. ఎంపీగా గెలిచిని తర్వాత కేంద్రం నిధులు తెస్తానని తెలిపారు.