ఎనిమిదేళ్ల బాలుడిపై వీధి కుక్కల దాడి.. తీవ్ర గాయాలు

పెద్దపల్లి జిల్లాలో వీధి కుక్కలు రెచ్చిపోతున్నాయి. ఓదెలా మండలం పోత్కపల్లి గ్రామంలో బాలుడిపై కుక్కలు దాడి చేశాయి. సిలివేరి సాయి కుమార్(8) అనే బాలుడు రోడ్డు పక్కన ఆడుకుంటుండగా కుక్కలు ఒక్కసారిగా దాడికి దిగాయి. దీంతో సాయి కుమార్ తీవ్ర గాయాలపాలయ్యాడు. వెంటనే బాధిత బాలుడిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. 

ALSO READ :2 వేల 250 కిలోల  నల్లబెల్లం పట్టివేత

మండలంలో రోజు రోజుకు వీధి కుక్కల దాడులతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. చిన్న పిల్లలను ఒంటరిగా బయటకు పంపించాలంటే భయామేస్తోందని స్థానికులు చెబుతున్నారు. మున్సిపల్ అధికారులకు ఎన్ని సార్లు చెప్పినా పట్టించుకోవడం లేదని వాపోయారు. వెంటనే అధికారులు కుక్కల నియంత్రణపై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.