సుల్తానాబాద్, వెలుగు : తనకు ఇంకా పెండ్లి కావ డం లేదని మనస్తాపం చెందిన ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఎస్సై విజేందర్ కథ నం ప్రకారం..పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ లోని మార్కండేయ కాలనీకి చెందిన పానేటి క్రాంతికుమార్(22) ఇనుప సామాన్లు అమ్ము కుంటాడు. కుటుంబసభ్యులు సంబంధాలు చూస్తున్నప్పటికీ సెట్ కావడం లేదు. దీంతో అతడు మద్యానికి బానిసయ్యాడు. సోమవారం సమీప బంధువుల ఇంటికి వెళ్లిన క్రాంతి తనకు ఇంకా పెండ్లి కావడం లేదని బ్లేడ్‌తో మెడ కోసుకున్నాడు.
వెంటనే వారు హాస్పిటల్‌కు తరలించి చికిత్స చేయించడంతో బతికి బయటపడ్డాడు. మళ్లీ తెల్లవారే స్థానిక అశోక్ నగర్ లో మద్యం మత్తులో పురుగుల మందు తాగాడు. కుటుంబసభ్యులు మళ్లీ హాస్పిటల్‌కు తీసుకువెళ్లగా, పరిస్థితి విషమంగా ఉందని చెప్పడంతో కరీంనగర్ తరలించారు. అక్కడే చికిత్స పొందుతూ బుధవారం చనిపోయాడు. మృతుడి తల్లి పద్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్ఐ తెలిపారు.