
పెద్దపల్లి మాజీ MLA బిరుదు రాజమల్లు గుండెపోటుతో చనిపోయారు. ఫిబ్రవరి 5వ తేదీ సోమవారం ఉదయం హైదరాబాద్ లోని నివాసంలో ఉదయం రాజమల్లుకు గుండపోటు రావటంతో కన్నుమూశారని కుటుంబ సభ్యులు తెలిపారు. రాజమల్లు మృతిపట్ల పలువురు ప్రజాప్రతినిధులు, రాజకీయ నాయకులు సంతాపం తెలిపారు.
గత కొంతకాలంగా రాజమల్లు ఊపిరితిత్తుల సమస్యతో బాధపడుతున్నారు. దీంతో మెడికవర్ ఆప్పత్రిలో ఆయన చికిత్స తీసుకున్నారు. ఈ క్రమంలో ఆయనకు ఊపిరితిత్తుల సర్జరీ చేసి వైద్యులు స్టంట్ వేశారు. ఇటీవల ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయిన బిరుదు రాజమల్లు ఈ రోజు గుండెపోటుతో మరణించారు.