సుల్తానాబాద్, వెలుగు: ఉమ్మడి ఏపీ స్పీకర్‌గా, మంథని ఎమ్మెల్యేగా దివంగత శ్రీపాదరావు పదవులకే వన్నెతెచ్చారని పెద్దపల్లి ఎమ్మెల్యే సీహెచ్ విజయరమణారావు అన్నారు. సుల్తానాబాద్ పట్టణంలో శనివారం మాజీ స్పీకర్ స్వర్గీయ శ్రీపాదరావు 25వ వర్ధంతిని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ఫొటోకు పూలమాలలు వేసి నివాళులు ర్పించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ పెద్దపల్లి అభివృద్ధిలో శ్రీపాదరావుది కీలక పాత్ర అన్నారు. కార్యక్రమంలో లీడర్లు అంతటి అన్నయ్యగౌడ్, మినుపాల ప్రకాశ్‌రావు, మహేందర్, అబ్బయ్య గౌడ్, చిలుక సతీశ్, శ్రీగిరి శ్రీనివాస్, రాజమల్లు, రఫీక్ పాల్గొన్నారు.
కరీంనగర్ సిటీ, వెలుగు: మాజీ స్పీకర్ స్వర్గీయ దుద్దిళ్ల శ్రీపాదరావు వర్ధంతి సందర్భంగా కరీంనగర్ డీసీసీ ఆఫీసులో కాంగ్రెస్ లీడర్లు ఆయన ఫొటోకు, సిటీలోని విగ్రహం వద్ద పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో కరీంనగర్ నియోజకవర్గ ఇన్‌చార్జి పురుమల్ల శ్రీనివాస్, సిటీ కాంగ్రెస్ అధ్యక్షుడు కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, పీసీసీ కార్యదర్శి అంజన్ కుమార్, లీడర్లు ఆరెపల్లి మోహన్, నరేందర్‌రెడ్డి, ఎండీ తాజ్, శ్రావణ్ నాయక్ , తదితరులు పాల్గొన్నారు. అనంతరం రజక సంఘం ఆధ్వర్యంలో వర్ధంతిని నిర్వహించారు.
మంథనిలో..
పెద్దపల్లి, వెలుగు: పెద్దపల్లి జిల్లా మంథని పట్టణంలోని శివ కిరణ్ గార్డెన్ లో మాజీ స్పీకర్ దివంగత దుద్దిళ్ల శ్రీపాదరావు వర్ధంతి నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన తనయుడు, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు.. శ్రీపాదరావు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు లక్ష్మణ్‌కుమార్, మక్కాన్‌సింగ్ రాజ్‌ఠాకూర్, ప్రేమసాగర్‌రావు, గడ్డం వివేక్ వెంకటస్వామి, గడ్డం వినోద్, పెద్దపల్లి ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీ, నాయకులు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.