ఉద్యోగాలు ఇవ్వడం ఓర్వలేకనే కుట్రలు 

ఉద్యోగాలు ఇవ్వడం ఓర్వలేకనే కుట్రలు 

పెద్దపల్లి / సుల్తానాబాద్, వెలుగు : పదేళ్లు నిరుద్యోగులను పట్టించుకోని బీఆర్ఎస్ లీడర్లు కేటీఆర్, హరీశ్‌‌‌‌‌‌‌‌రావు, ఇప్పుడు కాంగ్రెస్ సర్కార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఉద్యోగాలు ఇవ్వడాన్ని ఓర్చుకోలేకపోతున్నారని పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు విమర్శించారు. సుల్తానాబాద్ మున్సిపల్ పరిధిలోని పూసాల గ్రామంలో రూ.42 లక్షలతో నిర్మించిన ప్రైమరీ స్కూల్ భవనాన్ని గురువారం ప్రారంభించారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ బీఆర్ఎస్‌‌‌‌‌‌‌‌ లీడర్లు నిరుద్యోగుల పేరిట కృత్రిమ ఉద్యమాన్ని సృష్టిస్తున్నారన్నారు. సీఎం రేవంత్ రెడ్డి విద్యారంగాన్ని పటిష్టం చేసేందుకు చిత్తశుద్ధితో కృషి చేస్తున్నారని అన్నారు. ఇందులో భాగంగా డీఎస్సీ ద్వారా 11 వేల టీచర్ పోస్టుల భర్తీకి చర్యలు తీసుకున్నారన్నారు. ఒకవైపు కేసుల నుంచి తప్పించుకునేందుకు ఢిల్లీలో పీఎం ఆఫీస్‌‌‌‌‌‌‌‌ చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారని మండిపడ్డారు.

పత్తిపాక రిజర్వాయర్, పెద్దపల్లిలో బైపాస్ రోడ్డు, సుల్తానాబాద్ పట్టణ అభివృద్ధికి కృషి చేస్తున్నామన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ గాజుల లక్ష్మి, వైస్ చైర్ పర్సన్ బిరుదు సమత, లీడర్లు ప్రకాశ్‌‌‌‌‌‌‌‌రావు, సాయిరి మహేందర్, దామోదర్ రావు, అబ్బయ్య గౌడ్, చిలుక సతీశ్‌‌‌‌‌‌‌‌, కిషోర్, పన్నాల రాములు, సిద్ధ తిరుపతి, నీరటి శంకర్, పాల్గొన్నారు.